GAP Line

Main Banner

Wednesday, December 12, 2012

Narsapur Writers (Naveenn)

ప్రకృతి కి కృతి ఉంది
సంస్కృతి ఉంది
వీచే గాలికి లయఉంది
ప్రకృతి తన అందాలను
ఎందుకో దాచే ఉంచుతుంది
చినుకై నేలపై జారేముందు
నల్లటి కరిమబ్బులా ,
ఆకాశాన్ని చుట్టేసిన
సప్తవర్ణపు విల్లులా
ఆకు చాటు పిందెగా
విచ్చుకొని  మొగ్గలా
పూలుగా ,పండ్లుగా ,కనువిందుగా
ఆనందాలను పంచుతుంది
ప్రకృతి విధ్వంసకారి కాదు
కోటానుకోట్ల జీవనానికి
దోహదకారి ,సర్వోపకారి
మనిషే మనసు చెడి
ప్రకృతి ధ్వంసరచనకీ
తాపత్రయమంతా
జీవకోటి  మనుగడ
 ప్రశ్నార్థకమయ్యేంత ?

by
*Naveenn*
01-OCT-2018