GAP Line

Main Banner

Saturday, August 31, 2019

పౌష్టికాహారంతోనే ఆరోగ్యం....


నర్సాపూర్: మనుషులు ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలని నర్సాపూర్ సిడిపిఓ హేమ భార్గవి అన్నారు. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పోషణ మాసోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ లో శుక్రవారం నాడు అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఐసిడిఎస్ కార్యాలయం నుండి నర్సాపూర్ బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా చౌరస్తాలో మానవహారం నిర్వహించి, ఆమె మాట్లాడుతూ మహిళలు, గర్భిణీలు, బాలింతరాలు పోషక విలువలు గల ఆకుకూరలు తీసుకోవాలని గుర్తు చేశారు. వీళ్లంతా ఆరోగ్యంగా ఉండే పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే పిల్లలు బలంగా ఆరోగ్యంగా పుడతారని తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్టు పరిధిలో ఉన్న అన్ని అంగన్వాడి కేంద్రాల ద్వారా ఆకుకూరల పై, పౌష్టికాహారం పై మహిళలకు అవగాహన కల్పించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ హేమ భార్గవి తో పాటు సూపర్వైజర్లు అంజమ్మ, సరళకుమారి, అంగన్వాడీ టీచర్లు అన్నపూర్ణ, లక్ష్మి, శ్రీలత, స్వరూప తదితరులు పాల్గొన్నారు..