GAP Line

Main Banner

Tuesday, October 29, 2019

నన్ను కలవడానికి హైదరాబాద్‌ రావద్దు



రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. కానీ తనను కలిసేందుకు ప్రతి చిన్న పనికోసం ప్రజలు హైదరాబాద్‌కు రావడం తగదన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో వారానికి రెండు మూడురోజులపాటు అందుబాటులో ఉంటాను. అత్యవసరమైతే తప్ప.. హైదరాబాద్‌కు తనను కలవడానికి రావద్దని సూచించారు. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్‌కు రావడం కంటే సిద్దిపేటలోనే తనను కలవాలని తెలిపారు. ఆపద ఉన్నా, ఆస్పత్రి పని ఉన్నా హైదరాబాద్‌లోని ఇంటికి రావాలని కోరారు. వారానికి నాలుగు రోజులపాటు సిద్దిపేటలోనే ఉంటున్నా ప్రజలు హైదరాబాద్‌లోని తన ఇంటికి వస్తున్నారంటే తానెక్కడో ఫెయిల్‌ అయినట్లుగా భావించాల్సి వస్తోందని అనుకుంటున్నారు. అంత దూరం వచ్చి పనికాకపోతే మనసు నొచ్చుకుంటుందని తెలిపారు. ప్రజల మనసు నొచ్చుకుంటే తన మనసు నొచ్చుకున్నట్లేనని వివరించారు. దీనికి సంబంధించిన వీడియో..



No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments