GAP Line

Main Banner

Sunday, October 20, 2019

రిలయన్స్ జియో లాభం రూ.990 కోట్లు



ఇతర టెలికం సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ రిలయన్స్ జియో మాత్రం లాభాల్లో దూసుకుపోతున్నది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలానికిగాను సంస్థ రూ.990 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.681 కోట్లతో పోలిస్తే 45.4 శాతం అధికం. వినియోగదారులు పెరుగడం కంపెనీకి కలిసొచ్చింది. సమీక్షకాలంలో కంపెనీ ఆపరేటింగ్ ఆదాయం రూ.9,240 కోట్ల నుంచి 33.7 శాతం వృద్ధి చెంది రూ.12,354 కోట్లకు ఎగబాకింది. 35 కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన డిజిటల్ సేవల సంస్థగా జియో అవతరించిందని, ప్రస్తుతం కూడా ప్రతినెల కోటి మందికి పైగా వినియోగదారులు తమ నెట్‌వర్క్‌ను ఎంచుకుంటున్నారు..జియో అంటే దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ కాదని..డిజిటల్ గేట్‌వే ఆఫ్ ఇండియాగా మారిపోయింది అని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. ప్రతి ఒక్కో వినియోగదారుడి నుంచి కంపెనీకి రూ.120 ఆదాయం సమకూరుతున్నది. తొలి త్రైమాసికంలో వచ్చిన దాంతో పోలిస్తే రూ.2 తగ్గింది. సెప్టెంబర్ 30 నాటికి సంస్థకు 35.52 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments