GAP Line

Main Banner

Monday, October 21, 2019

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21 వ తేదీ దేశ వ్యాప్తంగా పోలీసు అమర వీరులను సంస్మరించుకుంటూ వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు పోలీసులు చేస్తున్న త్యాగాలు, విధుల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ అక్టోబర్‌ (21) 1959 సంవత్సరంలో కేంద్ర రిజర్వు బలగానికి చెందిన సిబ్బంది, దేశ సరిహద్దులలోని ఆక్సాయిచిన్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా హఠాత్తుగా పెద్ద సంఖ్యలో చైనా దేశానికి చెందిన సైనికులు దాడి చేశారు. ఈ ఘటనలో మన బలగాలు ఎంతో సాహసంతో ధైర్యంతో పోరాడి తమ ప్రాణాలను కోల్పోయారు. దేశ సరిహద్దులలో విధులు నిర్వహించేది, దేశ అంతర్గత భద్రత కల్పించేది పోలీసు మాత్రమే. నిరంతరం ప్రజలకు అన్నిసమయాలలో అందుబాటులో ఉండేది పోలీసులే. పోలీసు విధులు నిర్వహిస్తూ దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం 383 మంది పోలీసులు అమరులైనారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపడతారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల భాగ్యస్వామ్యం తో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మూడు రోజుల పోలీస్‌ ఎక్స్‌పో , పోలీస్‌ అమరవీరుల స్మారక పరుగు, పాఠశాల, కళాశాల విద్యార్థులతో ర్యాలీ, వైద్య శిబిరంతో పాటు రక్త దాన శిబిరాలు, వివిధ పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన, పెయింటింగ్‌ పోటీలు నిర్వహించడం జరిగింది.

No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments