GAP Line

Main Banner

Sunday, November 17, 2019

సాధన స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్పిల్లుట్ల గ్రామములో సాధన స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాధన స్వచ్చంద సంస్థ పోగ్రామ్ మేనేజర్ రాహుల్ మాట్లాడుతూ, ప్రతి ఆడపిల్లను భ్రతకనివ్వాలని, చదావనివ్వాలని, ఏ ఆడపిల్లను చిన్నచూపు చాడోదని అలాగే ప్రతిఒక్క విద్యార్థి, విద్యార్థినిలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు కోవాలని అన్నారు. సంస్థ ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలకు అంచలంచలుగా సైన్స్ ల్యాబ్, గ్రంధాలయం, ఆటల వస్తువులు, అలాగే చిన్న విద్యార్థులకు జరుడు బండ, మెరిగొరవ్డ్ (తిరుగుడు కుర్చీలు), ఉయ్యాల, ఏర్పాట్లు చేయిస్తామని అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ పెద్దపులి రవి, మరియు హనుమాన్ సేన రాజన్న గారిని సాధన సంస్థ వారు సన్మానించారు. సర్పంచ్ రవి మాట్లాడుతూ, సాధన స్వచ్చంద సంస్థ వారు చేస్తున్న కార్యక్రమాలు సమాజానికి, విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనవని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ పోగ్రామ్ మేనేజర్  రాహుల్ గారు, కోఆడినేటర్ రమేష్ మరియు సంస్థ సభ్యులు హనుమాన్ సేన రాజన్న, బబ్బూరి వెంకటేశం, గండ్ల ఆంజనేయులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments