GAP Line

Main Banner

Friday, November 1, 2019

చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జీవిత ఖైదు



సంగారెడ్డి టౌన్ : మూడేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ సంగారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. పోలీసుల వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన ఫాల్తెవర్ శ్రీనివాస్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీన్‌పూర్ మండలం మారుతీనగర్, ఉసికెబావి ప్రాంతంలో నివసిస్తూ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 2017 డిసెంబర్ 31వ తేదీన ఆర్సీపురం ప్రాంతానికి చెందిన ఓ బాలిక (3) తల్లిదండ్రులతో కలిసి ఇంటి సమీపం లో ఉన్న కూరగాయల దుకాణానికి వెళ్లింది. దీంతో శ్రీనివాస్ బాలికకు చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. అదే సమయంలో శ్రీనివాస్ మద్యం తాగి ఇంటికి వెళుతుండ గా శ్మశాన వాటిక సమీపంలో బాలిక ఏడుస్తూ కనిపించింది. బాలిక ఏడవడంతో శ్రీనివాస్ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి శ్రీనివాస్‌ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతడిపై క్రైమ్ నంబర్ 929/2017 నమోదు చేసి అండర్ సెక్షన్ 366 (ఏ), 376 (1) ఐపీసీ సెక్షన్ నమోదు చేశారు. దీంతో పాటుగా బాలికపై లైంగిక దాడి జరుపడంతో బాలల హక్కుల పరిరక్షణ చట్టం పోస్కో సెక్షన్ 4,6 నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో భాగంగా మంగళవారం సంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి బి.పాపిరెడ్డి నిందితుడు శ్రీనివాస్‌కు జీవితఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు పోలీసులు తెలిపారు. కేసులో తీర్పు రావడంతో సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ కేసు విచారణలో సహకరించిన అప్పటి మియాపూర్ ఏసీపీ రవికుమార్, ఆర్సీపురం ఇన్‌స్పెక్టర్ జె.రమేశ్ కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ భాస్కర్, రాంచందర్, కానిస్టేబుళ్లు సల్మాన్, నారాయణ, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు గాల్‌రెడ్డి, సైబరాబాద్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేప్టీ వింగ్ డీసీపీ అనసూయ, కోర్టు మానిటరింగ్ సెల్ అడిషనల్ డీసీపీ ఇందిరను అభినందించారు.

No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments