GAP Line

Main Banner

Friday, November 8, 2019

......తీర్పు పై సోషల్‌ మీడియాలో అంతా అలర్ట్‌

అసత్య ప్రచారాలు చేస్తే అరెస్ట్‌
......తీర్పు నేపథ్యంలో అంతా అలర్ట్‌
సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లతో జర భద్రం
డీజీపీ నీలమణి ఎన్‌.రాజు హెచ్చరికలు

బెంగళూరు: దేశంలోనే కీలక అంశమైన ......తీర్పు వెలువడనున్న తరుణంలో సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తే జైలు శిక్ష తప్పదని డీజీపీ నీలమణి ఎన్‌.రాజు వెల్లడించారు. రాష్ట్రమంతటా గురువారం నుంచే సోషల్‌ మీడియాపై నిఘా ఉంటుందని నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌తో పా టు అన్ని సోషల్‌ మీడియా ఖాతాలపైనా రాష్ట్ర పోలీసులచే నిఘా కొనసాగిస్తామన్నారు. కేంద్ర ఇంటలిజెన్స్‌ సూచనలకు అనుగుణంగా సోషల్‌ మీడియాపై పర్యవేక్షణ ఉంటుందన్నారు. సున్నిత ప్రాంతాల్లో భద్రతా చర్యలు కొనసాగిస్తామన్నారు. ప్రజలు శాంతిని కాపాడే దిశగా వ్యవహరించాలని పోలీసులతో సహకరరించాలన్నారు. వదంతులను నమ్మరాదని బంధువులు మిత్రులతో ఏర్పా టు చేసుకున్న వాట్సప్‌ గ్రూపులలో దుష్ప్రచారాలకు అవకాశాలు ఇవ్వరాదన్నారు. అనవసరమైన పోస్టింగ్‌లు, వీడియోలు అప్‌లోడ్‌ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా స్థాయిలోని పోలీసుల బందోబస్తును కొనసాగించిన అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశించామన్నారు. శాంతి సమావేశాలు నిర్వహించి అన్ని వర్గాలతో చర్చించాలని పోలీసులకు సూచించామన్నారు. ధార్మిక, రాజకీయ విషయాలలో పోస్టింగ్‌లు చేసినా వారెంట్‌ లేకుండానే అరెస్ట్‌ చేస్తామన్నారు. దేశంలో ఇదో కీలకమైన విషయమని రెచ్చగొట్టేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. చిత్రదుర్గ జిల్లా పర్యటనలో ఉన్న సీఎం యడియూరప్ప నీరగుందలో మీడియాతో మాట్లాడుతూ ......తీర్పు నేపథ్యంలో ప్రశాంతతకు భంగం కల్గించేలా ఎవరూ వ్యవమరించరాదన్నారు. 

No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments