GAP Line

Main Banner

Friday, December 27, 2019

హాస్టల్ విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు

హత్నూర: టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మన్నగారి దేవేందర్ రెడ్డి, 63వ జన్మదినం పురస్కరించుకొని గురువారం నాడు మండల కేంద్రమైన హత్నూర ఎస్టీ బాలికల వసతి గృహంలో విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల చెందిన విద్యార్థులు హాస్టల్లో ఉండి ఉన్నత చదువులు చదువుకున్నాటువంటి, పేద విద్యార్థులకు తన జన్మదిన సందర్భంగా హాస్టల్ లో ఉన్నటువంటి 280 మంది విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేశారు. దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. హాస్టల్ విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని వారు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తూ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని, నేటి బాలలే రేపటి పౌరులు ఎదగాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ భవాని, మండల పరిషత్ అధ్యక్షులు వావిలాల నర్సింలు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లు భాస్కర్ గౌడ్, యాదయ్య, ఎంపీటీసీ సభ్యులు కుంటమీది వీరేశం, టిఆర్ఎస్ నాయకులు పండగ రవికుమార్, అఫ్జల్, మన్నే రమేష్, సుధాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నవీన్ గౌడ్, మొగులయ్య, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments