GAP Line

Main Banner

Saturday, December 14, 2019

పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ ర్యాలీ

పౌరసత్వ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు నల్ల బ్యాడ్జీలు ప్లకార్డులు పట్టుకొని నర్సాపూర్ పట్టణంలో శుక్రవారం నాడు మౌలానా జమీల్ ఉలేమా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ స్థానిక పోస్ట్ ఆఫీస్ నుండి మార్కెట్ రోడ్ పోలీస్ స్టేషన్ ముందు నుండి ఆర్డీవో కార్యాలయం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలానా సమి యోద్దీన్ గారు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా పార్లమెంటులో తీసుకు వస్తున్న బిల్లుకు తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఈ బిల్లు ద్వారా ముస్లిం మైనారిటీల పౌరసత్వం ప్రశ్నార్ధకంగా మరే అవకాశం ఉందన్నారు. ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో బిల్లును వ్యతిరేకిస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఖాజి సంయొద్దిన్, ముస్లిం నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments