GAP Line

Main Banner

Tuesday, December 31, 2019

స్వామి వివేకానంద అడుగుజాడలో నడవాలి..నర్సాపూర్: వేకానంద సూక్తులు దేశానికి ఆదర్శమని ఆయన అడుగుజాడల్లో విద్యార్థులు నడవాలని పి.యన్.రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ పల్లె నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని పి.యన్.రెడ్డి హైస్కూలో స్వామి వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద దేశానికి చేసిన సేవలు అనే అంశంపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పి.యన్.రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ పల్లె నర్సింహారెడ్డి గారు మాట్లాడుతూ.. దేశ చరిత్రను ప్రపంచ దేశాల్లో చాటిచెప్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. అనంతరం పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద సేవా సమితి వ్యవస్థాపకులు తూముల రాంప్రసాద్ గారు, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ విభీషన్ రెడ్డి గారు, పాఠశాల ఇంచార్జ్ లక్ష్మి రెడ్డి గారు, ఉపాధ్యాయులు రవీనాథ్, పాషా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఈ పోస్ట్ పై కామెంట్ చేయడానికి,

1) Anonymous సెలెక్ట్ చెయ్యండి.

2) Comment టైపు చెయ్యండి.

3) Publish పైన Click చెయ్యండి.

 

Website Post ▸ Comments