GAP Line

Main Banner

Saturday, January 18, 2020

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: చందన దీప్తి గారుNG: ఈ నెల 22 జరగబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారులతో ఐ.పి.ఎస్ చందన దీప్తి గారు సమీక్షా సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజలు, యువకులు, యువతులు ఓటు వేసేటప్పుడు ఓటు యొక్క విలువను గుర్తుంచుకొని ఓటు వేయాలని సూచించారు. ఎందరో మహానుభావుల త్యాగఫలం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అవతరించిందని గుర్తుంచుకొని మీకు నచ్చిన మెచ్చిన వ్యక్తులకు ఓటు వేయాలని సూచించారు. సామాజిక మాధ్యమంలో సోషల్ మీడియాలో యువత జాగ్రత్తగా వ్యవహరించాలిని, రాజకీయ నాయకులపైన, నేతల పైన ఇష్టం వచ్చినట్లు పోస్ట్ చేయకూడదని, పోస్ట్ చేసిన వారిపై మున్సిపల్ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేయడానికి సమస్యాత్మకమైన కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్రమ రవాణా జరుగు డబ్బులు మద్యం గురించి అడ్డుకట్ట వేయడానికి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపినారు. ఎన్నికల నియమావళి ఎవరైనా ఉల్లంఘిస్తే ఫిర్యాదు కొరకు వాట్సాప్ నెంబర్: 7330671900 మెదక్: 9490617045, నర్సాపూర్: 9490617017, రామాయంపేట్: 9490617018, తూప్రాన్: 9490617016 డయల్ 100, లేదా మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్: 08452223533, 08452221667, లకు ఫోన్‌ చేసిన వారి పిర్యాదు మేరకు, విచారణ జరిపి తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు.