GAP Line

Main Banner

Friday, January 31, 2020

ఎనిమిది ఇళ్లల్లో చోరీ..నర్సాపూర్: ఎనిమిది ఇళ్లల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీ చేశారు. మూడు ఇళ్లల్లో నగదు, బంగారం దొంగలించారు. ఈ సంఘటన మండలంలోని తునికి లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం నర్సాపూర్ సీఐ నాగయ్య గారు, కౌడిపల్లి ఎస్ఐ రాజశేఖర్ గారు, సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తునికి గ్రామ ఉపసర్పంచ్ తాళ్ల మాణిక్య రెడ్డి (కొండల్ రెడ్డి) రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి శుభకార్యానికి బంధువుల వద్దకు వెళ్లారు, కాగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలకొట్టి బీరువాలో ఉన్న రూ.32 వేలు నగదు, 3 తులాల బంగారు ఆభరణాలు (చైన్, ముక్కుపుడక, కమ్మలు) చోరీ చేశారు. దీంతోపాటు గ్రామానికి చెందిన ఆవంచ పోచమ్మ ఇంటికి తాళం పగలకొట్టి అల్మారలోని రూ.50 వేలు నగదు చోరీ చేశారు. దీంతోపాటు అంబలి వీరమణి ఇంట్లో అల్మారాలో నుండి రూ.10 వేలు నగదు, పట్టు చీరలు చోరీ చేశారు. దీంతోపాటు తాళ్ల యశోద సాయిరెడ్డి, నరసింహారెడ్డి, కొన్యాల లక్ష్మి, అంబూరి లక్ష్మి, ఆరెగూడెం వెంకటయ్య ఇడ్లతాళాలు పగలగొట్టి చోరీకి యత్నించగా అక్కడ ఏమీ దొరకలేదు. దొంగల వేలిముద్రలను క్లూస్ టీం బృందం సేకరించి పరిశీలిస్తున్నారని సీఐ నాగయ్య గారు తెలిపారు.