GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Wednesday, September 25, 2019

చెత్త సేకరణ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారు

కౌడిపల్లి: తడి పొడి చెత్త సేకరణ కొరకు నూతనంగా టాటా ఏసీని కౌడిపల్లి మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆటో రావడం జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరు తడి పొడి చెత్తను వేరు చేసి ఉంచాలని, ఆటోలో వేసిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందని, ఆటో వ్యయం నాలుగు లక్షల రూపాయలు వరకు ఉంటుందని అందరూ వాహనాని ఉపయోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, కౌడిపల్లి జెడ్పిటిసి కవిత అమర్ సింగ్, చిలిపి చెడు జెడ్పిటిసి శేషసాయి రెడ్డి, కౌడిపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాలేరు శివ ఆంజనేయులు, కౌడిపల్లి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు చంద్రం దుర్గా గౌడ్, పిసికే శేట్టయ్య తదితరులు పాల్గొన్నారు.