GAP Line

Main Banner

Thursday, September 23, 2010

పెచ్చులు సరే… బ్రిడ్జీలే కూలిపోతే ?ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ, హడావిడి చేసి… హడావిడిగా మెదలుపెట్టిన మెట్రో రైల్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. మెట్రో సంస్థ చేసిన చిన్న చిన్న తప్పులు ఇప్పుడు నగరవాసులకు శాపంగా మారుతున్నాయి. మెట్రో ప్రారంబమై రెండు సంవత్సరాలు మాత్రమే గడుస్తున్నా, అప్పుడే ప్రయాణికుల యమపురికి దారులు వేస్తున్నాయి. కొంతకాలంగా మెట్రో స్టేషన్ల వద్ద పెచ్చులూడుతున్న ఘటనలు కూడా మెట్రో సంస్థ సీరీయస్ గా తీసుకోకపోవటంతో….ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మౌనిక ఘటనకు ముందు…ఇలాగే పెచ్చులూడిన సందర్భాలున్నాయి. మెట్రో స్టేషన్ల కింది నుండి వెళ్లే బైక్ రైడర్స్ పై పడ్డాయి. అయితే…పెద్ద ప్రమాదం సంభవించకపోవటంతో అంతా లైట్ తీసుకున్నారు. ఎవరికైనా ఫిర్యాదు చేయాలన్నా…ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితి. కానీ మౌనిక ప్రాణం పోవటంతో ఇప్పుడీ సమస్య పెద్దదైంది. దీనికి అసలు బాధ్యులెవరు…ప్రభుత్వమా, మెట్రో రైల్ సంస్థా…? ఎన్నో సంవత్సరాలు సేవలందించాల్సిన మెట్రో…రెండేళ్లకే ఇలా ఉంటే, రానున్న రోజుల్లో ఇంకెలా ఉండాలి. ఇప్పుడు సరే భవిష్యత్ లో ఇలాంటి ప్రాణ నష్టాలకు ఎవరిది భాద్యత…? పైగా జరిగిన తప్పుకు భాద్యత వహించాల్సింది పోయి… చిన్న ప్రకటనతో సరిపెట్టింది మెట్రో సంస్థ. మౌనిక ఘటనపై సంస్థ ఏం చెప్పిందంటే, ఒక చిన్న పెచ్చు ఊడిపడటంతో మౌనిక అనే అమ్మాయిపై పడింది. ఇది అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద జరిగింది. ఆ పెచ్చులు 9మీటర్ల పై నుండి మౌనిక తలపై పడటంతో తీవ్ర గాయాలు కాగా, ఎల్&టీ సంస్థ ప్రతినిధులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. 24ఏళ్ల మౌనిక టీసీఎస్ లో ఉద్యోగం చేస్తుందని, కేపీహెచ్బీలో నివాసముంటుందని తెలిపారు. కానీ…నిజానికి పెచ్చులూడిన తర్వాత అక్కడ ఎల్&టీ సంస్థ ప్రతినిధులు ఎవరూ వేగంగా స్పందించలేదు. తీవ్ర గాయాలైన మౌనికను…అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా, తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు చంద్రశేఖర్ అనే ఆటో డ్రైవర్. కానీ మౌనిక అప్పటికే మరణించింది. కనీసం స్పందించలేదన్న ఆరోపణలు వస్తాయన్న ఉద్దేశంతో…ఘటన జరిగిన చాలా సేపటికి మెట్రో సంస్థ మావాళ్లే ఆసుపత్రికి తీసుకెళ్లారంటూ మొసలి కన్నీరు కార్చింద్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ పెచ్చులూడుతున్న ఘటనపై హైదరాబాదీలు ఘాటుగా స్పందిస్తున్నారు. పెచ్చులు ఊడాయి..ప్రాణం పోయింది. ఇప్పుడు చర్చ దేనీ మీదా…పెచ్చులూడీపోయే అద్బుత కట్టడాలు కట్టిన నిర్మాణ సంస్థలు, మరి ట్రైన్ పోయేప్పుడు బ్రిడ్జీ కూలిపోతే…? ఎలాంటి రక్షణ కల్పిస్తారు అంటూ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ లను ప్రశ్నిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఎల్&టీ సంస్థ మెట్రో నిర్మాణాన్ని ప్రీకాస్టింగ్ విధానంలో నిర్మించింది. ముందుగానే స్టేషన్లు, బ్రిడ్జీలకు అవసరమైన వాటిని తయారు చేసి… అవసరమున్న చోట బిగించేశారు. అప్పటికే నిర్మించిన పిల్లర్లకు, బిగించిన వాటికి మద్యలో ఉండే గ్యాప్ ను సిమెంట్ తో ఫిల్ చేశారు. అయితే… దాన్ని చిన్న పనిగా చూస్తూ, సరిగ్గా ఫిల్ చేయకపోవటం…సిమెంట్ తో చేసిన ఫిల్లింగ్ కు ఎక్కువ నాణ్యత వచ్చేలా నీళ్లు కొట్టకపోవటంతో…అవి పెచ్చులూడుతున్నాయి. మెట్రో ట్రైన్ వెళ్ళేప్పుడు ఎక్కువగా ప్రకంపనలు ఉంటాయి. దాంతో…సిమెంట్ మిశ్రమం…ఆ ప్రకంపనలకు ఊడిపడిపోతుందంటున్నారు నిపుణులు.


అమీర్‌పేట్ మెట్రో ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్...