ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి...
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పధకాలలో లబ్దిదారులకు ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పడం
అన్యయంమని RESPONSIBLE CITIZENS సంస్ధ సభ్యులు తెలిపారు.
సోమవారం MPDO కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో
ఆధార్ నమోదు సంఖ్య,
కార్డుల పంపిణి,
ఎంతమంది పంపిణి కావాలిసి ఉంది,
అవి పంపిణి జరిగే వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం,
అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమిటి అన్న అంశాలతో కూడిన దరఖాస్తును సమర్పించిన
అనంతరం మాట్లాడుతూ విద్యార్ధులు స్కాలర్ షీప్ లు గాని ప్రభుత్వ సంక్షెమ పధకాలొ ఇచ్చే సబ్సిడీలు
పొందడానికి ఆధార్ కార్డు తప్పని సరి అని చెబుతున్నప్పటికీ వాటికి నమోదు చేయడంలో,
అందజేయడంలో అంతగా శ్రద్ధ చూపడం లేదన్నారు.
నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్ పట్టణంలో వెంటనే ఆధార్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసి చివరి
లబ్దిదారునికి కార్డు అందే వరకు కొనసాగించాలని కోరారు.