సమాజంలో రోజు రోజు కు పెరిగిపోట్టున్న అసమానతను దూరం చేసి
సమానత్వం సాధించే ప్రయత్నంలో భాగంగా
కుల, మత, రాజకీయాలకు అతీతంగా (RESPONSIBLE CITIZENS) సంస్థ నర్సాపూర్ లో ఏర్పడింది..
సంస్థ ముఖ్య ఉద్దేశ్యంగా సభ్యులందరూ స్టేజి పియర్ లేకుండా మాట్లాడగలిగే నిర్మనమైన వ్యక్తులుగా తయారయి తనచుట్టు ఉన్నసమాజనికి,
తద్వారా దేశానిర్మానానికి బాద్యతగల పౌరులుగ వ్యవరించడం,
ప్రభుత్వం ప్రజల గురించి చేపడుతున్న అన్ని పధకాలు అందరికి అందేట్లు తమవంతు ప్రయత్నం చేయడం,
అదేసమయంలో సమాజాన్ని వివిధ రంగాలలో సేవలు చేసిన వారిని గుర్తించి,
సన్మానించి తమ వంతు బాద్యతను నిర్వహించడం,
ఇందులో భాగంగానే శనివారం (02-02-2013) సాయంత్రం నలందా విద్య నిలయం లో
జరిగిన ప్రత్యెక కార్యక్రమంలో సేవ దృక్పదంతో నిస్వార్తంగా ఇప్పటికి 43 సార్లు రక్త దానం చేసి
సమాజానికి తన వంతు బాధ్యతగా సేవలందించిన బదె పాపారావు గారికి సంస్ట సభ్యులు సన్మానించారు...
=====================================================================
బదె పాపారావు (సన్మాన గ్రహిత) మాట్లాడుతూ :
సం" 3,4 సార్లు చొప్పున ఏమి ఆశించకుండా రక్తదానం చేస్తున్నట్లు,
సన్మానాలు పొందడం తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకున్నాసంస్థ సభ్యుల అభిమానాలు గౌరవించి
సహకరిస్తున్నట్లు తెలిపారు,
ప్రతి ఒక్కరు సం" కి రెండు సార్లు రక్తదానం చేసినట్లయీతే వారి ఆరోగ్యం ఎంతో బాగుండగలదు,
రక్తదానం చేసిన తృప్తికి మించిన తృప్తి ప్రపంచంలో మరేది ఉండదన్నారు....
=====================================================================