GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Tuesday, September 24, 2019

హుజూర్‌నగర్ బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి గారు..



హుజూర్‌నగర్ ఉపఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డిని తెలంగాణ బీజేపీ నేతలు ఎంపిక చేశారు. ఈసారి హుజూర్‌నగర్ ఉపఎన్నికలో తమ బలం నిరూపించుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. దీనిలో భాగంగానే అనేకమంది పోటీ పడినప్పటికీ శ్రీకళారెడ్డివైపే బీజేపీ అధిష్టానం మొగ్గుచూపింది. ఆమె తండ్రి జితేందర్ రెడ్డి కోదాడ మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీకళారెడ్డి భర్త కూడా బీఎస్పీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆమె కుటుంబమంతా రాజకీయ నేపథ్యంకాబట్టి.. ఆ దిశలో కూడా పరిశీలించిన బీజేపీ అధిష్టానం శ్రీకళారెడ్డివైపు మొగ్గుచూపింది. అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడంతో.. బీజేపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఎంపిక చేసినట్లు సమాచారం. బీజేపీ నేత, రాజ్యసభ సభుడు గరికపాటి మోహనరావు ఈమెకు మద్దతు తెలిపినట్టు సమాచారం.