GAP Line

Main Banner

Tuesday, September 24, 2019

సఫాయి కార్మికులకు దుస్తుల పంపిణిసఫాయి కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి తన మానవత్వాని చాటుకున్న లింగాపూర్ గ్రామా సర్పంచ్ చార్ల లక్ష్మి మణయ్య గారు, దసరా పండుగను దృష్టిలో పెట్టుకుని తన గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పంచాయతీ లో పనిచేస్తున్న కార్మికులకు ఎప్పుడు అన్ని విధాల గా ఆదుకుంటామని వారు అన్నారు. చాలీచాలని వేతనాలతో వాళ్లు కార్మికులగా కొనసాగుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి సరైన వేతనాలు లేకపోవడంతో మాకు తోచిన సాయాన్ని మా కార్మికులకు చేయడంలో ఎంతో తృప్తిగా ఉందని వారు స్పష్టం చేశారు.