GAP Line

Main Banner

Saturday, October 5, 2019

అమిత్ షా గారితో ముగిసిన సీఎం కేసీఆర్ గారి భేటీ



న్యూఢిల్లీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు సమావేశం అయ్యారు. ఈ సమావేశం పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. అమిత్ షాతో రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రెండు జీవనదుల అనుసంధానం జరిగితే తెలంగాణ, ఏపీల్లోని బీడుభూములన్నింటికీ సాగునీరు అందించే అవకాశం ఉన్నందున.. అతి కీలకమైన ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాలని సీఎం కేసీఆర్ ప్రధానిని కోరే అవకాశం ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధానిని పలుమార్లు కోరినప్పటికీ ఇవ్వలేదు. తాజాగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఉండటంతో ఈ రెండింటిలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరనున్నారు. రాష్ట్రంలో హైవేల విస్తరణపై కూడా చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రీజినల్ రింగ్‌రోడ్‌పై ఇప్పటికే డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు రక్షణశాఖకు చెందిన భూములను ఇవ్వాలని ప్రధానిని సీఎం కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ మంచినీటి కోసం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిన తర్వాతే.. కేంద్రం ఘర్‌ఘర్ జల్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర పథకానికి మిషన్ భగీరథను అనుసంధానంచేయాలని సీఎం ప్రధానిని కోరనున్నట్టు సమాచారం. వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం అందించే అంశంపైనా ప్రధానితో సీఎం మాట్లాడనున్నారు.