GAP Line

Main Banner

Saturday, October 5, 2019

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి



తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (IJU -TUWJ ) ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టు సమస్యలపై నర్సాపూర్ ఆర్డీఓ కార్యలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆనంతరం ఆర్డీఓ అరుణారెడ్డి గారికి  సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ వినతిపత్రం అందచేశారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు శంకర్ యాదవ్ చారి హాజరు కాగా డివిజన్ పరిధిలోని వివిధ మండలాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ గారు మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించి ఇండ్ల నిర్మించి ఇవ్వాలని, అందరికీ ఆరోగ్య కార్డులు అందజేసి అవి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. అంతేగాక 239 జీవోను రద్దు చేసి, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు గవినివెంకటేష్ గౌడ్, జిల్లా నాయకులు అశోక్ రెడ్డి, నర్సాపూర్ జర్నలిస్టులు శ్రీనివాస్, గణేష్, లింగం, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.