skip to main |
skip to sidebar
వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలోనే తన యూజర్లకు మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. వాట్సాప్‌లో ఇప్పటికే మనం పంపే మెసేజ్‌లను డిలీట్ చేసుకునే సౌలభ్యం అందిస్తున్న విషయం విదితమే. అయితే ఇకపై అందులో మనం పంపుకునే మెసేజ్‌లు నిర్ణీత సమయం (5 సెకన్ల నుంచి 1 గంట) వరకు మాత్రమే కనిపించి ఆ తరువాత వాటిని ఆటోమేటిగ్గా అదృశ్యమైపోయేలా చేయవచ్చు. అందుకుగాను వాట్సాప్‌లోని సెట్టింగ్స్ విభాగంలో అందజేసే డిసప్పియరింగ్ మెసేజెస్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉండగా.. త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికీ లభ్యం కానుంది.