skip to main |
skip to sidebar
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఎమ్మెల్యే
నర్సాపూర్: నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేశారు. రామచంద్ర పురం కాలనీలో సి. సి. రోడ్డు శంకుస్థాపన, పైడి శ్రీధర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు, ఆధ్వర్యంలో సాయిబాబా మందిరా ఆలయ స్థలంలో కమ్యూనిటీ హాల్ కి భూమి పూజ మధుసూదన్ రెడ్డి, నర్సాపూర్ గ్రంథాలయ అధికారి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ప్రక్కన నూతన గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యుడు సి.హెచ్. మదన్ రెడ్డి, చంద్ర గౌడ్ గ్రంథాలయ సంస్థ చైర్మన్, మురళి యాదవ్ మాజీ టిఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు, పంబల బిక్షపతి పట్టణ అధ్యక్షుడు, 150 మంది పట్టణ టి.ఆర్ఎస్ కార్యకర్తలు హాజరైనారు.