GAP Line

Main Banner

Thursday, August 29, 2019

ఆటో యూనియన్ జెండాను కూల్చేసిన దుండగులను శిక్షించాలి అని ధర్నా..



హత్నూర: మండల పరిధిలోని దౌల్తాబాద్ ఆటో యూనియన్ అడ్డ పై సిఐటియు జెండాను కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని బుధవారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ జెండాను కూల్చేసిన దుండగులను శిక్షించే వరకు సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆటో కార్మికులతో కలిసి హత్నూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సమర్పించారు. ఎస్ఐ సానుకూలంగా స్పందించి జెండా గద్దె ను ధ్వంసం చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఆటో యూనియన్ నాయకులు కృష్ణ, శేఖర్, పాపయ్య, నరసింహులు, అశోక్, సీను, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.