GAP Line

Main Banner

Thursday, August 29, 2019

సర్పంచ్ ఎంపిటిసి లకు అవగాహన సదస్సు..




హత్నూర: మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నాడు ఎంపీటీసీ సర్పంచ్ లతో అవగాహన సదస్సు నిర్వహించారు. మండల పరిషత్ అధ్యక్షులు వావిలాల నర్సింలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. హత్నూర తహశీల్దార్ జయరామ్ నాయక్, మాట్లాడుతూ గ్రామాలలో డంపింగ్ యార్డులు స్మశాన వాటికలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించడం జరిగిందని ప్రభుత్వ స్థలాలు లేని ఎడల ఎవరైనా దాతలు ల్యాండ్ ఇస్తే వాటిని పంచాయతీకి హ్యాండ్వర్ చేస్తామని లేనిపక్షంలో ప్రభుత్వమే పట్టాదారు రైతు దగ్గర కొన్ని పంచాయతీ ఇవ్వడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో నెలకొన్న టువంటి పారిశుథ్యం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ ఎమ్ పి టి సి లకు సూచించారు. స్వచ్ఛభారత్ పేరుతో గ్రామాలన్నీ శుభ్రంగా ఉండడానికి పంచాయతి కార్యదర్శి లు ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఆయన పిలిపించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీధర్, ఆర్ ఐ గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.