GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Friday, August 30, 2019

ప్రమాదంలో ఆదుకున్న సీఎం సహాయ నిధి..


హత్నూర: మండల పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన తోట్ల హరీష్ గత వారం రోజుల క్రితం జోగిపేట సమీపంలో యాక్సిడెంట్ గురికాగా హాస్పిటల్ ఖర్చులు పెట్టుకునే స్థోమత లేక మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ మూడు లక్షల వరకు ఖర్చు అవుతుందని హాస్పిటల్ యజమాన్యం చెప్పగా తోట్ల హరీష్ నిరుపేద కుటుంబానికి చెందిన వాడని అంత డబ్బు పెట్టుకునే పరిస్థితి లేదని స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ కింద 150000 రూపాయల ఎల్ వో సి లెటర్ ఇచ్చినట్లు లింగాపూర్ గ్రామ టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీశైలం అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యానికి గురై హాస్పటల్ కు చూపించుకునే పరిస్థితి లేనట్లయితే పూర్వ పరాలు పరిశీలించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తోట్ల మల్లేశం, ఆంజనేయులు, రాములు, సత్యనారాయణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.