skip to main |
skip to sidebar
నాటిన ప్రతి మొక్క బ్రతకాలి మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి..
నర్సాపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా శుక్రవారం నాడు నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంట రామన్ చెరువు శిఖంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి లు హాజరై మొక్కలు నాటినారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై నాటిన ప్రతి మొక్కని బ్రతికించాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో 33 శాతం పచ్చదనంగా చెట్లు ఉండాలనే ఉద్దేశ్యంతోనే మొక్కలు నాటడం జరుగుతుంది అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురావలంటే చెట్లు పెంచడంతో సాధ్యమవుతుందన్నారు. నేటి మొక్కలు రేపటి వృక్షాలుగా మారి భౌష్యత్ తరాల మానవాళికి ప్రాణవాయువుగా ఎంతో తోడ్పడుతుందని అన్నారు. నాటిన ప్రతి మొక్కను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అధికారులు అదేవిధంగా యువకులు, మహిళలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చూస్తామని అన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం కోమటిబండ నుండి నర్సాపూర్ కు నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారని ఎమ్మెల్యే మదన్ రెడ్డి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణరెడ్డి, పిడి సీతారామారావు, సిఓ లక్ష్మీబాయి, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు మురళీధర్ యాదవ్, రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వల్దాస్ మల్లేష్ గౌడ్, జిల్లా నాయకులు అశోక్ గౌడ్, వైస్ ఎంపీపీ వెంకటనర్సింగరావు, సర్పంచ్ శివకుమార్, ఉప సర్పంచ్ కడారి నాగరాజు, నర్సాపూర్ సిఐ నాగయ్య, టిఆర్ఎస్ నాయకులు మల్లేష్ యాదవ్, నర్సాపూర్ మాజీ సర్పంచ్ రమణరావు, సుభాష్ చంద్రబోస్, ఏపీవో అంజిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు..