GAP Line

Main Banner

Tuesday, August 27, 2019

ఇతనెవరు? అమిత్ షా ఆగ్రహం..!



ఢిల్లీ : తెలంగాణకు చెందిన వినీత్ రెడ్డి ఢిల్లీలో జగన్ టీముతో తిరుగుతుంటాడు. ఇతనెవరో.. ఎక్కడివాడో.. ఎవరూ ఎప్పుడూ అంతగా ఆరా తీయలేదు. జగన్ వెంట వుంటాడు కాబట్టి బిగ్‌ పర్సన్ అనుకుని సరిపెట్టుకుంటారు. ఐతే, అమిత్‌షా అలా ఊరుకునే రకం కాదు. ఈ వ్యక్తిని జగన్ తన దగ్గరకు తీసుకురావడం అమిత్ షాకు అస్సలు నచ్చలేదు. ‘ఈ వినీత్ రెడ్డి చెన్నైలో, ఢిల్లీలో నాకు క్లోజ్ అని చెప్పుకుంటున్నట్టు విన్నాను. అసలు ఈ వ్యక్తి మీతో ఎందుకు తిరుగుతున్నాడు’ అని అమిత్ షా ప్రశ్నించినట్టు తెలిసింది. వినీత్‌రెడ్డికి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రికీ మధ్యనున్న సంబంధం ఏమిటి అని అమిత్ షా కార్యాలయంలోని సిబ్బంది జగన్ బృందాన్ని ఆరా తీశారు. ఈ సంఘటన తరువాత వినీత్‌రెడ్డి ఇక జగన్ బృందంలో కనిపించకపోవచ్చని ఢిల్లీ పరిశీలకుల వ్యాఖ్య.