GAP Line

Main Banner

Wednesday, August 28, 2019

నర్సాపూర్ లో సర్వసభ్య సమావేశం..


నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, హాజరై వారి గ్రామ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఒక దశలో సభ్యులు వాగ్వాదానికి దిగటం, సభ రసాభాసగా అయింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో వామన్ రావు, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, వైస్ ఎంపీపీ నర్సింగ్ రావు, జడ్పీ సభ్యులు భాగ్య నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.