skip to main |
skip to sidebar
అరుణ్ జైట్లీ ఇంటికి మోదీ...
ఇటీవలే మృతిచెందిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుటుంబసభ్యుల్ని ప్రధాని మోదీ పరామర్శించారు. మూడుదేశాల పర్యటన ముగించకున్న ప్రధాని ఢిల్లీకి చేరుకున్నారు. దేశ రాజధానికి చేరుకున్న వెంటనే ఆయన జైట్లీ నివాసానికి చేరుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే జైట్లీ నివాసానికి వెళ్లి... ఇవాళ ఉదయం దివంగత అరుణ్ జైట్లీ కుటుంబాన్ని కలిశారు. జైట్లీ సతీమని, కుమారుడు, కూతుర్ని ప్రధాని ఓదార్చారు. మోదీతో వెంట కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. మోదీ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే అరుణ్ జైట్లీ కన్నుమూశారు. వెంటనే ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మోదీ మాట్లాడారు. అయితే, విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని రావద్దని, పర్యటనను పూర్తి చేయాలని ఆ సందర్భంగా మోదీని జైట్లీ కుటుంబసభ్యులు కోరినట్టు వార్తలు వచ్చాయి. ఆదివారం జైట్లీ అంత్యక్రియలను నిర్వహించారు. దీంతో జైట్లీ చివరి చూపుకు ప్రధాని దూరమయ్యారు.