GAP Line

Main Banner

Wednesday, August 28, 2019

ఇంటర్‌నెట్‌ సెన్సేషన్‌కు సల్మాన్‌ భారీ గిఫ్ట్‌ !

సోషల్ మీడియా అభివృద్ధి చెందుతుండటంతో గుర్తింపుకు నోచుకోని ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల తెలుగులో బేబీ అనే గాయని సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లోనూ ఇలాగే ఓ గాయని తెర మీదకు వచ్చారు. రణు మొండాల్ అనే మహిళ రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆమె గాత్రం లెజెండరీ సింగర్‌ లతా మంగేష్కర్‌ను పోలి ఉండటంతో పలువురు ప్రముఖులు ఆ వీడియోపై స్పందించారు. అంతేకాదు నటుడు, సంగీత దర్శకుడు హిమేష్‌ రేష్మియా తన తదుపరి సినిమా ‘హ్యాపీ హార్డీ అండ్‌ హీర్‌’లో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు. నిన్నటి వరకు ఎలాంటి గుర్తింపు లేకుండా రైల్వే స్టేషన్‌లో గడిపిన ఆమె ఇప్పుడు ఒక్కసారి బాలీవుడ్ సెలబ్రిటీగా మారిపోయారు. ఈ విషయం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ వరకు చేరటంతో ఆయన స్పందించారు.తనకు నచ్చిన వారికి విలువైన బహుమతులు ఇవ్వటంలో సల్మాన్‌కు ఎవరూ పోటీరారు. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు సల్లూ భాయ్‌. రణు మొండాల్ గాత్రాన్ని మెచ్చి ఆమెకు ఏకంగా 55 లక్షల విలువైన ఇంటిని కానుకగా ఇచ్చాడట. అంతేకాదు తన తాజా చిత్రం దబాంగ్ 3లో పాట పాడే అవకాశం కూడా ఇస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.