Showing posts with label Social Media Viral News. Show all posts
Showing posts with label Social Media Viral News. Show all posts
Tuesday, September 17, 2019
Friday, September 6, 2019
బర్త్‌డే కేక్ తిని.. తండ్రీకుమారుడి మృతి
సిద్దిపేట : అప్పటి వరకు తన పుట్టినరోజని ఆ బాలుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ బర్త్ డే కోసం తెచ్చిన కేక్ తనను మృతువు రూపంలో కబళిస్తుందని ఆ కుటుంబంలో ఎవరూ ఊహించి ఉండరు. పుట్టినరోజు వేడుకలు జరిగిన పది నిమిషాల్లోపే ఆ కుటుంబంలో విషాధ చాయాలు అలుముకున్నాయి. కేక్ తిన్న తండ్రి, కొడుకులు మృతి చెందడం, తల్లి, కుమార్తెలు ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకెళ్తే.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో నివాసముంటున్న ఇస్తారిగళ్ల రవి, సిద్దిపేట పట్టణంలోని సంజీవయ్యనగర్‌లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ అన్నదమ్ములు. పది సంవత్సరాల క్రితం ఆస్తి తగాదాల నేపథ్యంలో రవి తన అత్తగారి ఇల్లు అయిన ఐనాపూర్ గ్రామంలో కుటంబంతో స్థిరపడ్డాడు. గతంలో సంజీవయ్యనగర్‌లో ఉన్న ఉమ్మడి ఆస్తి అయిన ఇంటి విషయంలో ఆస్తి తగాదాలు ఉన్నట్లు సమాచారం. దాంతో గత పది సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేకపోవడం గమనార్హం. ఇదే క్రమంలో వారి బంధువు మృతి చెందడంతో అన్నదమ్ములిద్దరూ అక్కడే పలకరించుకున్నారు.
అనంతరం శ్రీనివాస్ రవి ఇంటికి వచ్చి రవి కుమారుడు రామ్‌చరణ్‌ను పలకరించాడు. దాంతో రామ్‌చరణ్ ఈ రోజు తన పుట్టినరోజని బాబాయ్ శ్రీనివాస్‌కి తెలిపాడు. దీంతో సిద్దిపేట నుంచి కేక్‌ను రామ్‌చరణ్‌కు పంపిస్తానని చెప్పిన శ్రీనివాస్ బుధవారం రాత్రి 9.30 గం. లకు సిద్దిపేట నుంచి కేక్‌ను పంపించాడు. 10 గంటల సమయంలో రామ్‌చరణ్(11) తన తల్లిదండ్రులు శ్రీనివాస్, నాగలక్ష్మి, అక్క పూజితలతో కలిసి బర్త్ డే కేక్ కట్ కేసి వేడుకలు జరుపుకున్నాడు. వేడుకలు జరుపుకున్న కొద్దిసేపటికే రామ్‌చరణ్‌తో పాటు తండ్రి రవి, తల్లి నాగలక్ష్మి, అక్క పూజితలకు వాంతులు, విరేచనాలు మొదలవడంతో స్థానికులు ఆటోలో సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పరీక్షించిన వైద్యులు పూజిత ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. తండ్రి రవి, రామ్‌చరణ్‌లకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో గురువారం వేకువజామున వారిరువురు మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తల్లి నాగలక్ష్మిని వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. ఈ మేరకు బంధువులు శ్రీనివాస్ వారి మృతికి కారణమని ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏరియా ఆస్పత్రికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రామ్‌చరణ్ బాబాయ్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడిషనల్ డీసీపీ లాండ్ ఆర్డర్ గోవిందు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీపీలు రామేశ్వర్, మహేందర్, సీఐలు ఆంజనేయులు, సైదులు, రఘులు పర్యవేక్షించారు.
Friday, August 30, 2019
ప్రాణం తీసిన ఫేస్‌బుక్ పరిచయం..
జడ్చర్ల రూరల్ : ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని.. ప్రేమ పేరుతో ట్రాప్ చేసిన యువకుడు ఓ బాలికను దారుణంగా హతమార్చిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం శంకరాయపల్లి తండా సమీపంలో చోటుచేసుకున్నది. పోలీసులు, బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జడ్చర్ల హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సురేఖ, రవిశంకర్ దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మా యి సిరిహర్షిణి(14) ఏనుగొండ కేంద్రీయ విద్యాలయంలో పదోతరగతి చదువుతున్నది. ఇటీవల ఫేస్‌బుక్‌లో రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కోహెడకు చెందిన ఏనుగు నవీన్‌రెడ్డి (28)తో పరిచయం ఏర్పడింది. తాను డిగ్రీ చేశానని మాయమాటలు చెప్పి నిత్యం సిరిహర్షిణితో ఫోన్‌లో మాట్లాడేవాడు. ఈనెల 27న సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన సిరిహర్షిణి సాయంత్రం 5:30 గంటలకు సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అదే సమయంలో నవీన్‌రెడ్డి అక్కడికి వచ్చి ఆ బాలికను కారులో ఎక్కించుకొని శంకరాయపల్లి సమీపంలో ని గుట్టల వైపు తీసుకెళ్లాడు. అక్కడ కొద్దిసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో నవీన్‌రెడ్డి లైంగిక దాడికి యత్నించగా బాలిక కేకలు వేసింది. ఎవరైనా వస్తే తన వ్యవహారం బయటపడుతుందని బాలిక ను కిందకు తోసేసి ఆమె తలపై బండరాయి వేసి పరారయ్యాడు. ఇంటినుంచి వెళ్లిన తమ కూతురు ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి సమీపంలో రోడ్డుపై సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా యువకుడితో కలిసి కారులో వెళ్లిన విషయాన్ని గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా బుధవారం యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. వారిని శంకరాయపల్లి సమీపంలోని గుట్టల ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ సిరిహర్షిణి విగతజీవిగా కనిపించింది. బాలిక మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. సిరిహర్షిణి హత్య కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, రాజకీయ నాయకులు, కుల సంఘాల వారు ప్రధాన రహదారిపై బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామ ర్శించారు. నిందితుడికి వరంగల్ తరహా శిక్ష పడేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయవాదులు వాదించకూడదని జడ్చర్ల బార్ అసోసియేషన్ నిర్ణయించిందని ఆ సంఘం అధ్యక్షుడు మాలిక్‌షాకీర్ తెలిపారు.
Thursday, August 29, 2019
హెయిర్ ఫాల్ ను తగ్గించడం కోసం ఆ మందు వాడారు.. చివరకు ఇలా అయ్యారు..
హెయిర్ ఫాల్ కోసం రకరకాల మందులను వాడుతుంటారు. అయితే వాటి గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాడితే భారీ ప్రమాదం ఉందనడానికి ఉదాహరణే ఈ ఉదంతం. స్పెయిన్ లో కొందరు యువకులు హెయిర్ ఫాల్ ను నిర్మూలించుకోవడం కోసం ఏవో ఔషధాలను వాడారు.. దాంతో వారి ముఖాలు తోడేళ్ళలాగా వికారంగా తయారయ్యాయి. మందు కల్తీ అవడం వల్ల ఇలా జరిగిందని వైద్యనిపుణులు గుర్తించారు. దీనిని ‘వర్‌ఫూల్ఫ్ సిండ్రోమ్’ అని పిలుస్తారని, వైద్య పరిభాషలో ‘హైపర్‌ట్రికోసిస్’గా వ్యవహరిస్తారని వారు తెలిపారు. హెయిర్ ఫాల్ కోసం తయారుచేసిన ఔషదం కలుషితం జరిగింది. దాంతో ఆ బ్యాచ్ కెమికల్ మొత్తం పాడైపోయింది. దీన్ని గమనించని కంపెనీ.. ఔషధాలను మార్కెట్ లోకి పంపించింది. దాంతో ఈ మందు వాడిన 16 మంది యువకులకు ముఖంమీద వికారంగా అవాంఛిత రోమాలు మొలిచాయి. వారి ముఖాలు అందవికారంగా తోడేలు ముఖాల వలె తయారయ్యాయని నిపుణులు గుర్తించారు. ఇందుకు కారణమైన స్పెయిన్ కు చెందిన ‘ఫార్మా క్వమికా’ కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేశామని, ఆ బ్యాచ్ సరకును మొత్తం మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నామని వైద్యాధికారులు చెప్పారు. భారత్ లో కూడా ఈ కంపెనీ తన ఔషధాలను విక్రయిస్తుందని స్పెయిన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.
Wednesday, August 28, 2019
ఇంటర్‌నెట్ సెన్సేషన్‌కు సల్మాన్ భారీ గిఫ్ట్ !
సోషల్ మీడియా అభివృద్ధి చెందుతుండటంతో గుర్తింపుకు నోచుకోని ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. ఇటీవల తెలుగులో బేబీ అనే గాయని సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ లోనూ ఇలాగే ఓ గాయని తెర మీదకు వచ్చారు. రణు మొండాల్ అనే మహిళ రైల్వే స్టేషన్‌లో పాటలు పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఆమె గాత్రం లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ను పోలి ఉండటంతో పలువురు ప్రముఖులు ఆ వీడియోపై స్పందించారు. అంతేకాదు నటుడు, సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా తన తదుపరి సినిమా ‘హ్యాపీ హార్డీ అండ్ హీర్’లో ఆమెకు పాట పాడే అవకాశం ఇచ్చాడు. నిన్నటి వరకు ఎలాంటి గుర్తింపు లేకుండా రైల్వే స్టేషన్‌లో గడిపిన ఆమె ఇప్పుడు ఒక్కసారి బాలీవుడ్ సెలబ్రిటీగా మారిపోయారు. ఈ విషయం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వరకు చేరటంతో ఆయన స్పందించారు.తనకు నచ్చిన వారికి విలువైన బహుమతులు ఇవ్వటంలో సల్మాన్‌కు ఎవరూ పోటీరారు. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు సల్లూ భాయ్. రణు మొండాల్ గాత్రాన్ని మెచ్చి ఆమెకు ఏకంగా 55 లక్షల విలువైన ఇంటిని కానుకగా ఇచ్చాడట. అంతేకాదు తన తాజా చిత్రం దబాంగ్ 3లో పాట పాడే అవకాశం కూడా ఇస్తున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Monday, September 27, 2010
పగుళ్లు తేలిన పీవీ నరసింహరావు ఎక్సప్రెస్ వే
మెట్రో మిగిల్చిన విషాదం తో నగరంలోని ఇతర నిర్మాణాలపై అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఫ్లైఓవర్ లు, ఇతర రవాణా వ్యవస్థ కట్టడాల పరిస్థితి ఏంటి, ఇప్పటికే మౌనిక రూపంలో మెట్రో మిగిల్చిన విషాదాలు పునరావృత్తం కాకుండా సర్కార్, మున్సిపల్ శాఖ చర్యలు తీసుకుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే మాత్రం భయపెడుతోంది. ఇప్పటికే వర్షాల కారణంగా ఆడం జోర్డాన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయారు. వర్షాల కారణంగా నే అయినా… అందులో అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. వివిధ శాఖల మధ్య సమన్వయ లేమి ఆడం మృతికి కారణం అయింది. అయితే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే చూస్తే అంతకన్నా పెద్ద విపత్తే కలిగేలా కనపడుతోంది. బ్రిడ్జికి పూర్తిగా పగుళ్లు వచ్చేశాయి. నిత్యం వాహనాల ప్రకంపనలతో వస్తున్న పగుళ్లు పెద్దవిగా మారుతున్నాయి. దీంతో వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇవేవి పట్టనట్లు వదలిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు బేగంపట బ్రిడ్జీ, తెలుగు తల్లి ప్లైఓవర్‌పై కూడా ఇలాంటి పగుళ్లే వస్తే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు కూడా అలాగే వదిలేశారు. కానీ, కేవలం పెచ్చులూడితేనే మెట్రో స్టేషన్ వద్ద మౌనిక చనిపోయింది. అలాంటి పెచ్చులే ఇక్కడ కూడా ఎవరిపైన పడితే, లేదా పగుళ్లు పెద్దదై అనుకోని ప్రమాదం సంభవిస్తే ఎవరిది బాధ్యత అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. పైగా ఇది జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తుంఇ. అంటే కేటీఆర్ నిర్వహిస్తున్న శాఖ గొడుగు కిందకు వచ్చేది. దీంతో… నెటిజన్లు పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే ఫోటోలు తీసి, కేటీఆర్‌కు ఇతర మున్సిపల్ అధికారులకు ట్యాగ్ చేస్తున్నారు. మరీ దీనిపై జీహెచ్‌ఎంసీ ఎంత త్వరగా రియాక్ట్ అయి, మరిన్ని ప్రాణాలు గాల్లో కలవకముందే బ్రిడ్జీ నాణ్యతను పరిశీలించి.
Saturday, September 25, 2010
ఈ చావుకు బాధ్యత ఎవరిదీ?
గ్రేటర్ హైదరాబాద్ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మంత్రి కేటీఆర్ నిర్వహిస్తున్న పురపాలక శాఖలో జరిగిన ఈ నిర్లక్ష్యానికి 23 ఏళ్ల యువకుడు బలయ్యారు. మేం అలర్ట్ గా ఉన్నాం, జనం బయటకు రాకండి అంటూ మెసెస్‌లు పెడుతున్న జీహెచ్‌ఎంసీ… గ్రౌండ్ లో పరిస్థితిని గాలికొదిలేసింది. భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు, వైర్లతో ప్రాణ నష్టం సంభవిస్తుందని తెలిసినా… పట్టించుకోకపోవటంతో ఆడమ్ జోర్డాన్ అనే జిమ్ ట్రైనర్ విద్యుత్ షాక్ తో మృత్యువాత పడ్డారు. ఆడమ్ అనే 23ఏళ్ల యువకుడు కల్ట్ ఫిట్ అనే సంస్థలో జిమ్ ట్రైనర్. గచ్చిబౌలిలోని జిమ్‌లో క్లాస్‌కు అటెండ్ అయి, తన హస్టల్‌కు వెళ్లిపోయేందుకు బయటకు వచ్చారు. అప్పటికే కురిసిన భారీ వర్షంతో పొంగుతున్న గుంతల వద్ద కాలు పెట్టాడు. కానీ ఆ నీటిలో కరెంటు వైరుకు ఆనుకొని ఉన్న ఇనుప రాడ్‌ను గమనించకపోవటంతో… అక్కడిక్కడే మృతి చెందాడు. మంగళవారం రాత్రి 11గంటలకు జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Subscribe to:
Posts (Atom)





.gif)
.gif)
.gif)
.gif)

