skip to main |
skip to sidebar
పగుళ్లు తేలిన పీవీ నరసింహరావు ఎక్సప్రెస్ వే
మెట్రో మిగిల్చిన విషాదం తో నగరంలోని ఇతర నిర్మాణాలపై అనుమానాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఫ్లైఓవర్ లు, ఇతర రవాణా వ్యవస్థ కట్టడాల పరిస్థితి ఏంటి, ఇప్పటికే మౌనిక రూపంలో మెట్రో మిగిల్చిన విషాదాలు పునరావృత్తం కాకుండా సర్కార్, మున్సిపల్ శాఖ చర్యలు తీసుకుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే మాత్రం భయపెడుతోంది. ఇప్పటికే వర్షాల కారణంగా ఆడం జోర్డాన్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయారు. వర్షాల కారణంగా నే అయినా… అందులో అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. వివిధ శాఖల మధ్య సమన్వయ లేమి ఆడం మృతికి కారణం అయింది. అయితే పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే చూస్తే అంతకన్నా పెద్ద విపత్తే కలిగేలా కనపడుతోంది. బ్రిడ్జికి పూర్తిగా పగుళ్లు వచ్చేశాయి. నిత్యం వాహనాల ప్రకంపనలతో వస్తున్న పగుళ్లు పెద్దవిగా మారుతున్నాయి. దీంతో వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే, చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇవేవి పట్టనట్లు వదలిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు బేగంపట బ్రిడ్జీ, తెలుగు తల్లి ప్లైఓవర్‌పై కూడా ఇలాంటి పగుళ్లే వస్తే సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత కానీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు కూడా అలాగే వదిలేశారు. కానీ, కేవలం పెచ్చులూడితేనే మెట్రో స్టేషన్ వద్ద మౌనిక చనిపోయింది. అలాంటి పెచ్చులే ఇక్కడ కూడా ఎవరిపైన పడితే, లేదా పగుళ్లు పెద్దదై అనుకోని ప్రమాదం సంభవిస్తే ఎవరిది బాధ్యత అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. పైగా ఇది జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తుంఇ. అంటే కేటీఆర్ నిర్వహిస్తున్న శాఖ గొడుగు కిందకు వచ్చేది. దీంతో… నెటిజన్లు పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే ఫోటోలు తీసి, కేటీఆర్‌కు ఇతర మున్సిపల్ అధికారులకు ట్యాగ్ చేస్తున్నారు. మరీ దీనిపై జీహెచ్‌ఎంసీ ఎంత త్వరగా రియాక్ట్ అయి, మరిన్ని ప్రాణాలు గాల్లో కలవకముందే బ్రిడ్జీ నాణ్యతను పరిశీలించి.