GAP Line

Main Banner

Friday, October 1, 2010

మన నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డుల వివరాలు
నర్సాపూర్ మున్సిపాలిటీలో 15 వార్డులు ఉన్నాయి. నర్సాపూర్ మున్సిపాలిటీలో జనాభా, ఓటర్ల ప్రతిపాదికన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటర్లకు అనుగుణంగా మొత్తం 15 వార్డులను విభజన చేశారు. గతంలో మేజర్ గ్రామపంచాయతీలో 18 వార్డులు ఉండగా అప్‌గ్రేడ్ చేసి మొదట 9 వార్డులను అధికారులు ప్రతిపాదించగా ఇటివల ప్రభుత్వం మరో 6 వార్డులను అదనంగా చేసి 15 వార్డులుగా ఖరారు చేసింది. మొత్తం 13493 మంది ఓటర్లు ఉన్నారు. 1వ వార్డులో 896 ఓటర్లు ఉండగా పెద్దమ్మకాలనీ, విఘ్నేశ్వరకాలనీలు ఉన్నాయి. 2వ వార్డులో 912 ఓటర్లు ఉండగా హన్మంతాపూర్, జగన్నాథరావు కాలనీలు ఉన్నాయి. 3వ వార్డులో 899 ఓటర్లు ఉండగా శ్రీరాంనగర్ కాలనీలో కొంత భాగం, హనుమాన్‌టెంపుల్ ఏరియాలు ఉన్నాయి. 4వ వార్డులో 837 మంది ఓటర్లు ఉన్నారు. శ్రీరాంనగర్ కాలనీలో కొంత భాగం, బస్టాండ్ ఏరియాలు ఉన్నాయి. 5వ వార్డులో 932 మంది ఓటర్లు ఉన్నారు. చైతన్యపురికాలనీ, అల్యూమినీయం ఫ్యాక్టరీ, వెంకటేశ్వరకాలనీ, శ్రీరాంనగర్ కాలనీలో కొంత భాగాలు ఉన్నాయి. 6వ వార్డులో 879 మంది ఓటర్లు ఉన్నారు. వినాయకనగర్‌కాలనీ, సునీతాలకా్ష్మరెడ్డి కాలనీలు ఉన్నాయి. 7వ వార్డులో 918 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్‌జీవోఎస్‌కాలనీ ఉంది. 8వ వార్డులో 912 మంది ఓటర్లు ఉన్నారు. కోర్టు ఏరియా, గంగమ్మ ఎక్స్‌రోడ్డు, తుకారాంతండా, మున్సిపల్‌ఆఫీస్, ప్రభుత్వ దవాఖాన ఏరియాలు ఉన్నాయి. 9వ వార్డులో 872 మంది ఓటర్లు ఉన్నారు. గాంధీ విగ్రహం, ఇమ్మడి వాసుదేవ్, నరేందర్‌చారి, లిటిల్‌ఫ్లవర్ స్కూల్, దుద్దాల రాయుడు ఇంటి వరకు ఉన్నాయి. 10వ వార్డులో 812 మంది ఓటర్లు ఉన్నారు. మాచర్ల ఎక్స్‌రోడ్డు, బాదేసత్యనారాయణ, గల్స్‌స్కూల్, అమనుల్లాఖాన్ ఇంటి వరకు, 11 వ వార్డులో 913 మంది ఓటర్లు ఉన్నారు. గంగమ్మ ఎక్స్‌రోడ్డు, ప్రైమరి స్కూల్, సుల్తాన్‌పూర్, ఫకీర్‌వాడ, దర్గా, శివాలయం వరకు, 12వ వార్డులో 876 మంది ఓటర్లు ఉన్నారు. తొంటదుర్గమ్మ, దండుపద్మ, భాగమారిసత్యం, చౌటిభాలయ్య ఇంటి వరకు, 13వ వార్డులో 965 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ మిల్, ఎస్సీ కమ్యునిటీ హాల్, డీలర్‌సుధాకర్, దండుదశరథ,సాయిడీలక్స్, కుంటకట్ట వరకు, 14వ వార్డులో 972 మంది ఓటర్లు ఉన్నారు. అంజిరెడ్డి దవాఖానా, ఎస్‌బీఐ, ధర్మశాల, దుర్గమ్మగుడి, పెద్దకటికెవాడ వరకు, 15వ వార్డులో 898 మంది ఓటర్లు ఉన్నారు. పర్వేజ్‌ఎక్బల్, కబేలా, పోస్ట్‌ఆఫీస్, దండుపాండు, మాధవరావు గిర్ని వరకు నిర్ణయించారు.