GAP Line

Main Banner

Saturday, September 25, 2010

ఈ చావుకు బాధ్యత ఎవరిదీ?


గ్రేటర్ హైదరాబాద్ అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మంత్రి కేటీఆర్ నిర్వహిస్తున్న పురపాలక శాఖలో జరిగిన ఈ నిర్లక్ష్యానికి 23 ఏళ్ల యువకుడు బలయ్యారు. మేం అలర్ట్ గా ఉన్నాం, జనం బయటకు రాకండి అంటూ మెసెస్‌లు పెడుతున్న జీహెచ్‌ఎంసీ… గ్రౌండ్ లో పరిస్థితిని గాలికొదిలేసింది. భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు, వైర్లతో ప్రాణ నష్టం సంభవిస్తుందని తెలిసినా… పట్టించుకోకపోవటంతో ఆడమ్ జోర్డాన్ అనే జిమ్ ట్రైనర్ విద్యుత్ షాక్ తో మృత్యువాత పడ్డారు. ఆడమ్ అనే 23ఏళ్ల యువకుడు కల్ట్ ఫిట్ అనే సంస్థలో జిమ్ ట్రైనర్. గచ్చిబౌలిలోని జిమ్‌లో క్లాస్‌కు అటెండ్ అయి, తన హస్టల్‌కు వెళ్లిపోయేందుకు బయటకు వచ్చారు. అప్పటికే కురిసిన భారీ వర్షంతో పొంగుతున్న గుంతల వద్ద కాలు పెట్టాడు. కానీ ఆ నీటిలో కరెంటు వైరుకు ఆనుకొని ఉన్న ఇనుప రాడ్‌ను గమనించకపోవటంతో… అక్కడిక్కడే మృతి చెందాడు. మంగళవారం రాత్రి 11గంటలకు జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.