skip to main |
skip to sidebar
సమాజ సేవలో ఆర్యవైశ్యులు పాల్గొనాలి
సంగారెడ్డి: ఆర్యవైశ్యులు దైవకార్యాలతోపాటు సమాజ సేవలో పాల్గొని ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జూలకంటి లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఆదివారం సదాశివపేట పట్టణంలో ఆ సంఘం కార్యాలయంలో ఆర్యవైశ్య జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశాన్ని లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. శనివారం ఇంజినీర్స్ డేను పురస్కరించుకుని ఇంజినీర్స్ సుదర్శనం, దారం కృష్ణమూర్తి, ముత్యం నారాయణను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం సభ్యులు దైవ కార్యాలకే పరిమితం కాకుండా సమాజ సేవలో తమవంతు బాధ్యతగా సేవచేసే భాగ్యాన్ని పొందాలని సూచించారు. అప్పుడే సమాజంలో ఆర్యవైశ్యులకు గుర్తింపుతోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు వస్తుందని అన్నారు. కార్యక్రమంలో కంగ్టి జడ్పీటీసీ సభ్యురాలు లలితాఆంజనేయులు, ఎంపీటీసీ విజయలక్ష్మి, విశ్రాంత ఉపాధ్యాయులు రాములు, మల్లయ్య, సంగమేశ్వర్, మాణిక్‌ప్రభు, దయాకర్, పొద్దుటూరి శ్రీనివాస్, మాశెట్టి ప్రకాశం, సుధాకర్, రాజయ్య, సాయిరాజ్, భిక్షపతి, నగేష్, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.