GAP Line

Main Banner

Sunday, September 15, 2019

మోటర్ వెహికిల్ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయం





కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికిల్ చట్టం ఎన్నో వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 01వ తేదీ నుంచి కొత్త మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చాక.. ట్రాఫిక్ చలాన్ల బాదుడు మొదలైంది. దీంతో వాహనదారులు హడలిపోతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది జారీ చేస్తున్న చలాన్లు రికార్డు సృష్టిస్తున్నాయి. లక్షల్లో ఫైన్‌లు ఉంటుండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. పశ్చిమ బెంగాల్ సహా మరికొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని చెప్పగా.. గుజరాత్ వంటి రాష్ట్రాలు జరిమానాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ సమావేశంల్లో ఆదివారం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ కొత్త మోటార్ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్రం తీసుకొని వచ్చిన కొత్త మోటర్ వెహికిల్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోమని ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే చట్టాలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం విధానాలు రూపొందిస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.