GAP Line

Main Banner

Sunday, September 15, 2019

ఎల్లంకి కలశాలలో ఫ్రెషర్స్ డే...



నర్సాపూర్:- నర్సాపూర్ లోని స్థానిక ఎల్లంకి డిగ్రీ కళాశాల లో ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో చదివే విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ గొప్ప చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సిఐ నాగయ్య అన్నారు. శనివారం నాడు నర్సాపూర్ పట్టణంలోని ఎల్లంకి కళాశాల నూతన విద్యార్థుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మణికొండ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించగా, స్థానిక సిఐ నాగయ్య ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ నాగయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో ఉత్తమమైనదని ముఖ్యంగా కళాశాల జీవితం ఉన్నత శిఖరాలకు పునాది లాంటిదని వారు అన్నారు. కళాశాలలోని సీనియర్ విద్యార్థులు తమ తోటి జూనియర్ విద్యార్థులతో స్నేహభావంగా ప్రేమతో కలిసి మెలిసి ఉంటు ఉత్తమమైన ఫలితాలను సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని వారు అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని కళాశాలలలో ఎల్లంకి కళాశాలకు ప్రత్యేక స్థానం ఉందని అందుకుగాను ప్రిన్సిపల్ అశోక్ కుమార్ విద్యార్థులతో సఖ్యతగా ఉంటూ సమాజ మార్పు కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ఎల్లంకి కళాశాల గుర్తింపుకు మూలం అని వారు అన్నారు.