Showing posts with label Education News. Show all posts
Showing posts with label Education News. Show all posts
Thursday, September 19, 2019
Sunday, September 15, 2019
ఎల్లంకి కలశాలలో ఫ్రెషర్స్ డే...
నర్సాపూర్:- నర్సాపూర్ లోని స్థానిక ఎల్లంకి డిగ్రీ కళాశాల లో ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో చదివే విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ గొప్ప చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సిఐ నాగయ్య అన్నారు. శనివారం నాడు నర్సాపూర్ పట్టణంలోని ఎల్లంకి కళాశాల నూతన విద్యార్థుల పరిచయ వేదిక కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మణికొండ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించగా, స్థానిక సిఐ నాగయ్య ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ నాగయ్య పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో ఉత్తమమైనదని ముఖ్యంగా కళాశాల జీవితం ఉన్నత శిఖరాలకు పునాది లాంటిదని వారు అన్నారు. కళాశాలలోని సీనియర్ విద్యార్థులు తమ తోటి జూనియర్ విద్యార్థులతో స్నేహభావంగా ప్రేమతో కలిసి మెలిసి ఉంటు ఉత్తమమైన ఫలితాలను సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని వారు అన్నారు. నర్సాపూర్ పట్టణంలోని కళాశాలలలో ఎల్లంకి కళాశాలకు ప్రత్యేక స్థానం ఉందని అందుకుగాను ప్రిన్సిపల్ అశోక్ కుమార్ విద్యార్థులతో సఖ్యతగా ఉంటూ సమాజ మార్పు కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడమే ఎల్లంకి కళాశాల గుర్తింపుకు మూలం అని వారు అన్నారు.
Wednesday, August 28, 2019
ర్యాగింగ్ చేస్తే చర్యలు..
సంగారెడ్డి: కళాశాలల్లో చదువుతున్న సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం కంది మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిదాలయ ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని ర్యాగింగ్ చట్టంలో ఉన్న నియమ నిబంధనల ప్రకారం తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయడం మానుకోవాలని సూచించారు. నూతన మోటారు వెహికల్ చట్టాల విధి విధానాలు విద్యార్థి దశ నుంచి తెలుసుకుంటే అవగాహన కలుగుతుందని అన్నారు. చదువుపై ఆత్మ విశ్వాసంతో ఇష్టపడి విద్యార్థులు చదువుకుని కన్నవారి ఆశలను నిజం చేసే బాధ్యత తీసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
వ్యవసాయరంగంలో రోజు రోజుకు మారుతున్న ఆధునాతన పరిశోధనలతో రైతులకు అవసరమయ్యే సేవలు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాస్‌కుమార్ మాట్లాడుతూ ర్యాగింగ్ నిరోధానికి కళాశాలలో చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు విద్యార్థిని విద్యార్థుల్లో సోదరభావాన్ని కలిగి ఉండాలని అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రైతులకు సేద్యంలో ఉపయోగపడే అంశాలపై విద్యార్థులు దృష్టి సారించి క్షేత్రస్థాయి పర్యటనలో భాగం పంచుకుని పంటల సాగులో అన్నదాతలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారని గుర్తు చేశారు. వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ అని గ్రామీణ సీఐ శివకుమార్ అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)







.gif)
.gif)
.gif)
.gif)

