skip to main |
skip to sidebar
మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్న మంత్రి హరీష్ రావు గారు
నంగునూరు: మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన పుల్లిగిల్ల సత్తయ్య అనే వ్యక్తి, ఇటీవల ప్రమాదవశాత్తు బోరు బావి వద్ద విద్యుత్ తీగలు తగలడంతో మరణించాడు. విషయం తెలుసుకున్న మంత్రి, స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వం తరపున సత్తయ్య కుటుంబానికి అందాల్సిన నష్ట పరిహారం విషయంలో, సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. అంతే కాకుండా సత్తయ్య పెద్ద కుమారుడు వరుణ్ కుమార్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీ.టెక్ చదువుతున్నాడు. కాగా అతని చదువు ఖర్చుల నిమిత్తం తన వ్యక్తిగతంగా, 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, మరోసారి మంత్రి హరీష్ రావు తన ఉదారతను చాటుకున్నారు.