skip to main |
skip to sidebar
తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా చేపట్టాలి..
నర్సాపూర్ :- తెలంగాణ విమోచన దినాన్ని తెరాస ప్రభుత్వం అధికారికంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నర్సాపూర్ తహసీల్దార్ భిక్షపతికి వినతిపత్రం అందజేశారు. నర్సాపూర్ బిజెపి నాయకులు పాపగారి రమేష్ గౌడ్ మాట్లాడుతూ మహారాష్ట్ర కర్ణాటకలో మాదిరిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారికంగా చేపట్టాలని ఆయన వినతిపత్రంలో డిమాండ్ చేశారు. తెలంగాణ స్వరాష్ట్రంలో తెలంగాణ విమోచన దినాన్ని జరిపించకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర విమోచన దినాన్ని అధికారికంగా చేపట్టకపోతే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ రాజేందర్, సురేష్, బుచ్చేష్ యాదవ్, పాల్గొన్నారు.