skip to main |
skip to sidebar
గోదావరి జలాల్ని నర్సాపూర్ కి తీసుకువస్తాను ఎమ్మెల్యే మదన్ రెడ్డి
శివ్వంపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి నర్సాపూర్ నిరయోజవర్గం లోని అన్ని గ్రామాలకు గోదావరి జలాల్ని తీసుకువచ్చి ప్రజల తాగు, సాగునీటి అవసరాలను తీర్చుతానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్ర మైన శివంపేట గ్రామాన్ని ఇటివల దత్తతతీసుకున్నారు. ముప్ఫై రోజుల అభివృద్ధి ప్రణాళిక, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ ర్యాకల హేమలత, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, హార్టికల్చర్ ఏడీ నర్సయ్య, డీపీవో హనోక్, జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా, ఎంపీపీ కల్లూరి హరికృష్ణలతో కలిసి వారు శివంపేట, శభాశ్ పల్లి గ్రామాల్లో పర్యటించి, శ్రమదానం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా వారు శివంపేట లోని తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రోడ్డు పక్కన మొక్కలు నాటారు, అక్కడి నుంచి రామాలయం వద్ద కు చేరుకొని మొక్కలు నాటి మొక్కలు నాటి నిరూపట్టారు. శివంపేట జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా సొంత డబ్బులతో నిర్మించతల పెట్టిన చిల్డ్రన్ పార్క్ నిర్మాణానికి గురువారం భూమిపూజ గావించి, పనులు మొదలు పెట్టారు. అక్కడి నుంచి గ్రామంలో ప్రధాన వీధుల గుండా తిరుగుతూ శ్రమదానం చేసి, పారిశుద్ధ్య పనుల్లో పాల్గొని రోడ్డులను ఊడ్చి, చేత్తను ఎత్తిపోశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా పరిషత్ చైర్మన్ హేమాలత మాట్లాడుతూ మన గ్రామాలను మనమే అభివృద్ధి చేసుకోవాలంటే గ్రామస్థులు సమిష్టిగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి మాట్లాడుతూ మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి అనారోగ్యం నికి గురికమన్నారు. ముప్ఫై రోజుల అభివృద్ధి ప్రణాళిక కార్యక్రమాల్లో ఫాల్గొన్నారు.