skip to main |
skip to sidebar
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు
నరేంద్ర దామోర్‌దాస్ మోడీ 2014లో భారతీయ జనతా పార్టీని అద్భుతమైన మోజార్టీతో గెలిపించి భారతదేశపు 14వ ప్రధానిగా ఎన్నికయ్యారు. మోడీ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన గుజరాత్ నుంచి మొట్ట మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రిగా నియమింపబడ్డారు. అదే తరహాలో తొలి సారి ఎంపీగా ఎన్నికై భారత ప్రధాని పదవిని చేపట్టారు. 1984వ సంవత్సరం తర్వాత లోక్‌సభలో భాజపాకు భారీ ఆధిక్యాన్ని తెచ్చిపెట్టిన ఘనత నరేంద్ర మోడీదే. గుజరాతీ అయిన మోడీ వాద్‌నగర్‌లో పుట్టారు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. తండ్రి టీ స్టాల్‌లో సాయం చేస్తూ ఆయన కూడా సొంతంగా మరో టీ స్టాల్ పెట్టుకున్నారు. ఎనిమిదేళ్ల వయస్సున్నప్పుడే ఆర్ఎస్ఎస్‌లో చేరి అక్కడి నుంచి అదే సంస్థతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత 1985వ సంవత్సరంలో బీజేపీతో కలిశారు.