GAP Line

Main Banner

Saturday, September 21, 2019

చిన్నపిల్లలకు రోటా వ్యాక్సిన్ తప్పనిసరి వేయించాలి



నర్సాపూర్ : ఏడాది లోపు చిన్నపిల్లలకు రోటా వాక్సిన్ ఇప్పించడంతో వచ్చే వ్యాధులు రాకుండా నివారించవచ్చునని.. ఎంపీపీ జ్యోతిసురేష్ నాయక్ అన్నారు. శుక్రవారం నాడు నర్సాపూర్ మండల పరిధిలోని రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నపిల్లలకు రోటా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జ్యోతిసురేష్ నాయక్ మాట్లాడుతూ చిన్నపిల్లలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని అందులో భాగంగానే ఈరోజు రోటా వ్యాక్సిన్ చిన్నపిల్లలకు వేయడంతో వ్యాధినిరోధక శక్తి పెరిగి చిన్నపిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వారు అన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపులను గ్రామాలలోని చిన్నపిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని, తమ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం తప్పనిసరిగా రోటా వ్యాక్సిన్ వేయించాలని వారు అన్నారు. రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని చిన్నారులకు ఎంపీపీ జ్యోతిసురేష్ నాయక్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఆంజనేయులుగౌడ్, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వైద్య సిబ్బంది చందు, శోభారాణి, నిర్మల తదితరులు ఫాల్గొన్నారు.

----------------------------------------------------------

కౌడిపల్లి : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద శనివారం రోజున రోటా వైరస్ వ్యాక్సిన్ను, తహసిల్దార్ ఎంపీడీవో, జెడ్పిటిసి, ఎంపిపి, వైస్ ఎంపీపీ ,గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ వారి ఆధ్వర్యంలో ప్రారంభించనున్నట్లు కౌడిపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వెంకట్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ విజయలక్ష్మి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వెంకట్ యాదవ్ మాట్లాడుతూ రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది చిన్న పిల్లలకు నీళ్ల విరేచనాలు కాకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి, ఈ వ్యాక్సిన్ను 6, 10, 14 వారాల పిల్లలకు మూడుసార్లు వేయించాలని, వ్యాక్సిన్ కోసం ఒక్కో చిన్నారిపై 4500 రూపాయలు ఖర్చుపెట్టి, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ మారుమూల గ్రామంలో నివసించే వారికి తండాలో నివసించేవారికి తెలియడం కోసం ఒక రోజు ముందుగానే ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని వారు తెలిపారు.