skip to main |
skip to sidebar
రెండోరోజు కొనసాగుతున్న ఆశావర్కర్ల రిలే నిరాహార దీక్షలు : హత్నూర
హత్నూర : ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నాడు సిఐటియు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు మహిపాల్, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యలు పరిశీలించి వారి గౌరవ వేతనం చేస్తామని మాట ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రెండో రోజు కూడా రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఆశ వర్కర్లకు నెలకు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వమే సంవత్సరానికి ఆరు జతల యూనిఫాం రిజిస్టర్లు సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు పరిశీలించని యెడల ఈ నెల 23న జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు సుజాత, గోదావరి, ఎల్లమ్మ, నరసమ్మ, సద్గుణ, భాషమ్మ, శైలజ, ప్రసన్న, లక్ష్మినరసమ్మ, ప్రశాంతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.