skip to main |
skip to sidebar
హైవే రోడ్డు పనులను పరిశీలించిన స్థానిక మదన్ రెడ్డి గారు
నర్సాపూర్: దుందిగల్ నుండి మెదక్ రాంపూర్ వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణం పనులను ఇంకా వేగవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంట్రాక్ట్ వెంకట్ రెడ్డి సూచించారు. నర్సాపూర్ పట్టణంలో తొందరగా పనులను పూర్తి చేసి, పట్టణ ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని కాంట్రాక్టు వెంకట్ రెడ్డి తో అన్నారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ ను కూడా తొందరగా మెరుగు పరచాలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీమతి వాకిటి సునితాలక్ష్మారెడ్డి, మాజీ తెరాస జిల్లా అధ్యక్షుడు మురళి యాదవ్, అశోక్ గౌడ్, హాబీబ్ ఖాన్, మాజీ వార్డ్ మెంబెర్ నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.