GAP Line

Main Banner

Wednesday, October 2, 2019

Responsible Citizens సంస్థ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు



మహాత్మా గాంధీ 150 వ జయంతి పురస్కరించుకొని Responsible Citizens సంస్థ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పేషేంట్ లకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేసారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు పాముల యాదగిరి మాట్లాడుతూ గాంధీ తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసాడని తను కోరుకుంటే ఏ పదవి చేపట్టడానికి అయినా ఎవరికి అభ్యంతరం ఉండేది కాదని, అయినప్పటికి ఏ పదవి చేపట్టకుండా మహాత్ముడు అయ్యాడని అన్నారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు తమ జీవితం లో ఒక సారైనా చదివి తాను సూచించిన స్వచ్ఛత స్వదేశీ తదితర సిద్ధాంతాల గొప్పతనాన్ని గుర్తించి ఆచరణ లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, ప్రేమ్ కుమార్, వినోద్, చెంద్ర శేఖర్, బాబురావు, రాజు యాదవ్, సోలేటి రఘు, బ్రహ్మం, నాగరాజులు తదితరులు పాల్గొన్నారు.