Showing posts with label Local Association News. Show all posts
Showing posts with label Local Association News. Show all posts
Thursday, October 3, 2019
Wednesday, October 2, 2019
Responsible Citizens సంస్థ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
మహాత్మా గాంధీ 150 వ జయంతి పురస్కరించుకొని Responsible Citizens సంస్థ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పేషేంట్ లకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేసారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు పాముల యాదగిరి మాట్లాడుతూ గాంధీ తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసాడని తను కోరుకుంటే ఏ పదవి చేపట్టడానికి అయినా ఎవరికి అభ్యంతరం ఉండేది కాదని, అయినప్పటికి ఏ పదవి చేపట్టకుండా మహాత్ముడు అయ్యాడని అన్నారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు తమ జీవితం లో ఒక సారైనా చదివి తాను సూచించిన స్వచ్ఛత స్వదేశీ తదితర సిద్ధాంతాల గొప్పతనాన్ని గుర్తించి ఆచరణ లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, ప్రేమ్ కుమార్, వినోద్, చెంద్ర శేఖర్, బాబురావు, రాజు యాదవ్, సోలేటి రఘు, బ్రహ్మం, నాగరాజులు తదితరులు పాల్గొన్నారు.
Sunday, September 29, 2019
బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ
ఇటీవల విద్యుత్ షాక్ తో కొన్యాల గ్రామానికి చెందిన పత్తి మల్లేశం, పత్తి నర్సమ్మ మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఆ కుటుంబాన్ని రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ తరపున శనివారం 25 కిలోల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు చనిపోయి అనాధగా మారిన పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పిల్లల చదువు విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ఉన్నత చదువులు చదివించడానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎవరైనా భూమి యజమానులు చేను చుట్టూ కరెంటు షాక్ పెడితే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కరెంటు షాక్ వలన చనిపోతే ఆ భూమి మొత్తం బాధిత కుటుంబాలపై రాసే విధంగా జీవోలు జారీ చేసి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో రెస్పాన్సిబుల్ సిటిజన్ మాజీ అధ్యక్షులు బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Thursday, September 19, 2019
మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. ఎన్నికలు
నర్సాపూర్ పట్టణ టూవీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హుస్సేన్ (అబ్బాస్) ఎన్నికయ్యారు. బుధవారం నర్సాపూర్ పట్టణ లో టూవీలర్ మెకానిక్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా సమీ, సహాయ కార్యకర్తగా అర్జున్ గౌడ్, కోశాధికారిగా మహేష్, సలహాదారులుగా జాంగిర్ పాషా, సుల్తాన్ బాష, నరసింహ గౌడ్ ఎన్నికయ్యారు.
Subscribe to:
Posts (Atom)





.gif)
.gif)
.gif)
.gif)

