GAP Line

Main Banner

News Image
News Image
News Image
News Image
News Image

Sunday, September 29, 2019

బాధిత కుటుంబానికి బియ్యం పంపిణీ



ఇటీవల విద్యుత్ షాక్ తో కొన్యాల గ్రామానికి చెందిన పత్తి మల్లేశం, పత్తి నర్సమ్మ మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఆ కుటుంబాన్ని రెస్పాన్సిబుల్ సిటిజన్ సంస్థ తరపున శనివారం 25 కిలోల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు చనిపోయి అనాధగా మారిన పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పిల్లల చదువు విషయంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ఉన్నత చదువులు చదివించడానికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎవరైనా భూమి యజమానులు చేను చుట్టూ కరెంటు షాక్ పెడితే నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కరెంటు షాక్ వలన చనిపోతే ఆ భూమి మొత్తం బాధిత కుటుంబాలపై రాసే విధంగా జీవోలు జారీ చేసి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో రెస్పాన్సిబుల్ సిటిజన్ మాజీ అధ్యక్షులు బాబురావు తదితరులు పాల్గొన్నారు.