skip to main |
skip to sidebar
దసరా సెలవులలో పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని
ప్రస్తుతం కురుస్తున్న వానలకు చెరువులు నిండి కాలువలు పారుతున్న సందర్భంగా పిల్లలతోపాటు పెద్దలు కూడా ఈతకు వెళ్లడానికి సరదా పడుతుంటారు. ఈత రాకున్నా చెరువుల్లో, కాలువల్లో, సిమ్మింగ్‌పూల్‌లో, నీటి గుంటల్లో దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. తగిన జాగ్రత్తలు తీసుకోని కారణంగా ఆ సరదా ప్రాణాలను హరిస్తోందిని జిల్లా యెస్ పి కుమారి చందన దీప్తి ఐ.పి.యెస్ గారు తెలిపినారు. దసరా సెలవులు ఇచ్చినప్పటినుంచి సరదాగా ఈతకు వెళ్ళే వారి సంఖ్య ఎక్కువ అవడం వల్ల ప్రమాదాలు మరింత ఎక్కువ జరిగే అవకాశం ఉందని . ముఖ్యంగా పల్లెల్లో పిల్లలు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారని, వచ్చిరాని ఈతతో బావులు, కుంటలు, కాల్వల్లోకి దిగి తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.